చిన్న ఇన్వెస్టర్లకు శుభవార్త : ఆర్బీఐ రిటెయిల్ డైరెక్ట్ స్కీమ్
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ప్రారంభించారు . గవర్నమెంట్ బాండ్ మార్కెట్ తలుపుల్ని రీటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరిచింది భారత ప్రభుత్వం. "ఆర్‌బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా చిన్న ఇన్వెస్టర్లు కూడా ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో సురక్షిత మాధ్యమం ద్వారా పెట్టుబడులు పెట్టడం సాధ్యం అవుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు. కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ ప్రారంభించిన ఈ పథకం పెట్టుబడి మార్గాలను పెంచుతుందని, క్యాపిటల్ మార్కెట్‌కు సులభంగా, సురక్షితంగా యాక్సెస్ లభిస్తుందని అన్నారు. ఆర్‌బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ రీటైల్ ఇన్వెస్టర్లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పథకం. రీటైల్ ఇన్వెస్టర్లు గవర్నమెంట్ సెక్యురిటీస్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే సెక్యూరిటీస్‌లో ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఆర్‌బీఐ ప్లాట్‌ఫామ్‌లో ఉచితంగా గవర్నమెంట్ సెక్యురిటీస్ అకౌంట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయొచ్చు.