ముహూరత్ ట్రేడింగ్:

ముహూరత్‌ ట్రేడింగ్‌ అంటే...


స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే... వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది ఇన్వెస్టర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఏటా దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు కొనసాగుతుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమయంలో కనీసం ఒక్క స్టాక్‌ అయినా కొనాలని చాలామంది ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. సెంటిమెంట్ కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో చాలామంది ముహూరత్ ట్రేడింగ్‌లో పాల్గొంటారు. ఈ సమయంలో మంచి స్టాక్స్‌ను ఎంచుకొని, దీర్ఘకాలం కొనసాగించే ప్రయత్నం చేయాలి. చాలామంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కేవలం సెంటిమెంట్ కోసం మాత్రమే ట్రాన్సాక్షన్ నిర్వహిస్తారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఓపెన్‌గా ఉన్న పొజిషన్లకు సెటిల్మెంట్ నిబంధనలు వర్తిస్తాయి. ట్రేడర్లు రెసిస్టెన్స్, సపోర్ట్ స్థాయిలను పరిశీలించాలి.

సుమూహుర్తం రోజున దీపావళి బలిప్రతిపద సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు రోజు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున మొదలయ్యే కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్‌తో ఆహ్వానం పలుకుతాయి. సంవత్ 2078 ప్రారంభ సందర్భంగా సాయంత్రం ఒక గంట పాటు ట్రేడింగ్ ఉంటుంది. ఈ సంవత్ క్యాలెండర్‌ ను ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ కు చెందిన వ్యాపారస్తులు పాటిస్తారు. స్టాక్ మార్కెట్లో 70% ట్రేడర్స్ , ఇన్వెస్టర్స్ మరియు బ్రోకర్స్ ఈప్రాంతం వారే.  1957 నుండి దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. శుభముహూర్తం నేపథ్యంలో ట్రేడింగ్ ఒక పద్ధతిగా మారింది. ఈ సంవత్సరం కూడా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి.

ముహూరత్ ట్రేడింగ్ పరిమిత సమయంలో జరుగుతుంది. రెండు పార్టీల మధ్య స్టాక్ కొనుగోలు/విక్రయానికి సంబంధించి అంగీకారం కుదురుతుంది. దీనిని బ్లాక్ డీల్ సెషన్ అంటారు. స్టాక్ ఎక్స్చేంజీలు ఈక్విలిబ్రియంను నిర్ణయిస్తాయి. ఈ సెషన్ ఎనిమిది నిమిషాలు ఉంటుంది. ఇది ప్రీ-ఓపెన్ సెషన్. నార్మల్ మార్కెట్ సెషన్ ఉంటుంది. ఈ సమయంలో అసలు ట్రేడింగ్ జరుగుతుంది. తేలిగ్గా అమ్ముడుపోని సెక్యూరిటీల ట్రేడింగ్ జరుగుతుంది. ఇది కాల్ ఆక్షన్ సెషన్. ముగింపు ధర వద్ద ఇన్వెస్టర్లు మార్కెట్ ఆర్డర్‌ను పెడతారు. ఇది క్లోజింగ్ సెషన్. బ్లాక్ డీల్ సెషన్ 17:45 - 18:00, ప్రీ-ఓపెన్ మార్కెట్ 18:00 - 18:08, నార్మల్ మార్కెట్ 18:15 - 19:15, కాల్ ఆక్షన్ సెషన్ 18:20 - 19:05, క్లోజింగ్ సెషనల్ 19:25 - 19:35. మొత్తం దాదాపు రెండు గంటలు ఉంటుంది.
 
ముహూరత్ ట్రేడింగ్ సాధారణంగా చివరిలో చేయడం లాభదాయకం.
All The Best For Samvath 2078
Happy & Profitable Trading
                                               -Srinivas Mokenapalli


Comments