స్టాక్ మార్కెట్ లో అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ సూత్రాలు


స్టాక్ మార్కెట్ గూర్చి కనీస అవగాహన ఉన్నవారందరకీ వారెన్ బఫెట్ గూర్చి తెలిసే ఉంటుంది. ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ ఇన్వెస్టర్ గా పేరుగాంచారు. ఆయన బెంజమిన్ గ్రాహమ్ రాసిన ది ఇంటలిజెంట్ ఇన్వెస్టర్ అనే బుక్ నుండి మెళకువలు తెలుసుకుని చిన్న వయసు నుండే ఇన్వెస్ట్ చేయడం‌ ప్రారంభించారు. 2008 లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించి ఇప్పటికీ టాప్వ10 జాబితాలో కొనసాగుతున్నారు. అందికే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్  చేసే వారందరికీ ఆదర్శం వారెన్ బఫెట్. ఆయన అనుసరించిన వ్యూహాలు... చెప్పిన సూత్రాలు... మనం కూడా పాటిస్తే, మనం కూడా విజయవంతమైన పెట్టుబడిదారుడిగా మారవచ్చు.స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. అయితే తీవ్ర ఆటుపోట్లు, ఒడుదొడుకులు ఉండే ఈ స్టాక్ మార్కెట్లో సరైన వ్యూహాలు అనుసరిస్తే, ఖచ్ఛితంగా సంపద సృష్టించవచ్చని నిరూపించారు వారెన్ బఫెట్.

వారెన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ సూత్రాలు:

మొదటి సూత్రం:
రూల్ నంబర్ 1: ఎప్పుడూ డబ్బు పోగొట్టుకోకండి.
రూల్ నంబర్ 2: రూల్ నెం.1ని ఎప్పటికీ మర్చిపోకండి.

 రెండవ సూత్రం:
“మనకు అవగాహన లేని వ్యాపారాల జోలికి పోకూడదు. కేవలం మీకు అవగాహన ఉన్న రంగాలనే ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీ పెట్టుబడిని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుస్తుంది. సంపదను కూడా సృష్టించగలుగుతారు" అని వారెన్ బఫెట్ సూచిస్తుంటారు.

 మూడవ సూత్రం:
మంచి పోటీతత్వంతో మెరుగైన పనితీరును కనబరిచే కంపెనీలు త్వరగా వృద్ధి చెందుతాయి. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల, మీరు పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీరు తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగే సంస్థలు, లేదా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న బ్రాండ్ల కంపెనీలను గుర్తించి, వాటిలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

నాలుగవ సూత్రం:
కొన్ని సందర్భాల్లో మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని బఫెట్ సూచిస్తుంటారు.

ఐదవ సూత్రం:
మంచి కంపెనీ  షేర్లను సమంజసమైన ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. కానీ అంతగా పనితీరు కనపరచని కంపెనీ షేర్లను మాత్రం.... అవి ఎంత మంచి ధరకు లభించినా కొనుగోలు చేయకూడదని బఫెట్ సూచిస్తున్నారు.

ఆరవ సూత్రం:
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా మంది స్టాక్ మార్కెట్ అనాలసిస్ చేస్తుండడం గమనిస్తూ ఉన్నాం. నిజానికి వారికున్న క్వాలిఫికేషన్ గురించి మీరు ఎప్పుడైనా ఆరా తీసారా? కనీసం ఆలోచించారా? లేదుకదా వారికున్న పాపులారిటీని అనుసరించి, మనం కూడా వారిని అనుసరిస్తుంటాం. కానీ ఇది సరైన విధానం కాదు. సోషల్ మీడియాలో చెప్పేవారి సూచనలను గుడ్డిగా నమ్మకూడదు.వారెన్ బఫెట్ ఏమి చెబుతారంటే, "స్టాక్ మార్కెట్ ను  ఖచ్ఛితంగా అంచనా వేయడం ఏ ఒక్కరి వల్లా కాదు. అందువల్ల మార్కెట్ను అంచనా వేయడం మానేయండి. వడ్డీరేట్లు, దేశ ఆర్థిక పరిస్థితులు, ఎన్నికలు మొదలైనవి... మార్కెట్పై చూపే ప్రభావం గురించి కూడా ఆలోచించకండి. మీరు కేవలం కంపెనీకి సంబంధించిన ఆర్థిక విషయాలను, దాని భవిష్యత్ అంచనాలను, విలువలను విశ్లేషించండి. అవన్నీ అనుకూలంగా ఉంటేనే ఆ కంపెనీ షేర్లను కొనడం లేకుంటే అమ్మడం చేయండి."

ఏడవ సూత్రం:
వారెన్ బఫెట్... పెట్టుబడుల విషయంలో over diversification వద్దు అని చెబుతారు.నష్టభయాన్ని తగ్గించుకునేందుకు వీలుగా మీ పెట్టుబడిని diversification చేయడం మంచిదే. అయితే అది కేవలం 5 నుంచి 10 కంపెనీల షేర్ల వరకే పరిమితం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆయా కంపెనీ గురించి ట్రాక్ చేయడానికి, మరింతగా వాటిపై రీసెర్చ్ చేయడానికి వీలవుతుంది.ఒక కంపెనీ వ్యాపారాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఆశించిన స్థాయిలో మనకు రాబడి వస్తుందని వారెన్ బఫెట్ చెబుతారు.

ఎనిమిదవ సూత్రం: 
“మీరు చెల్లించేది ధర... మీకు దక్కేది విలువ."

తొమ్మిదవ సూత్రం:
ఒకవేళ మీరు పెట్టుబడిదారుడు అయితే... సంబంధిత కంపెనీలో ఏం జరుగుతుందో నిత్యం ట్రాక్ చేస్తూ ఉండాలి.ఒక వేళ మీరు స్పెక్యులేటర్ అయితే... కంపెనీ షేరు ధర ఎలా ఉండబోతోంది అన్నదానిపై దృష్టి కేంద్రీకరించాలి.

పదవ సూత్రం:
బఫెట్ దృష్టిలో విజయవంతమైన పెట్టుబడిదారుడు ఎలా ఉంటడంటే .. "మిగతావారు అంతా మార్కెట్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటే కొంచం భయపడేవాడు . అందరూ భయపడుతూ దూరమవుతుంటే, ఉత్సాహంగా మార్కెట్లో పాల్పొనేవాడు."

పదకొండవ సూత్రం: ఎవరైతే సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటూ... తప్పుడు నిర్ణయాలను బాగా తగ్గించుకుంటారో... వారే సంపద సృష్టించగలుగుతారని వారెన్ బఫెట్ గట్టిగా నమ్ముతారు.

ఈ సూత్రాలతో పాటు ఎవరైతే వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి, ధైర్యంగా, ఓపికతో ఉంటారో వారే విజయవంతమైన  పెట్టుబడిదారుడిగా నిలువగలరు.

పైన మెన్షన్ చేయబడ్డ ది ఇంటలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ ఇదే.. 

Comments

Post a Comment