ప్రజా ప్రతినిధులు సామాజిక బాధ్యత గా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి.


ఒక్కసారి ఆలోచించండి..

మారుమూల ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు ఎన్నో..వీటిల్లో చదివేదంతా పేద , బలహీన వర్గాల పిల్లలే.. వీరికి చదువుకోవాలంటే కేవలం ఒక్క ప్రభుత్వ పాఠశాలల మాత్రమే దిక్కు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ అత్యంత దారుణమైన పరిస్తతుల్లో ప్రభుత్వ విద్య ఉంది. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన ప్రచార ఆర్భాటలే తప్ప ప్రభుత్వ పాఠశాలలకు ఒరిగిందేమీ లేదు. కరోన మహమ్మారి ప్రజలను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిన ఈ తరుణంలో ప్రయివేటు బడులకు పంపే స్తోమత లేక ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్ని ఆశ్రయిస్తే ప్రభుత్వ స్కూల్స్ లో విధిలేక చేర్పిస్తే అదేదో తమగొప్పగా ప్రభుత్వం చెప్పుకోవడం అత్యంత దురదృష్టకరం
మన ఊరు-  మన బడి పథకం తో ప్రభుత్వ పాఠశాలల్ని సమూలంగా దశలవారీగా మారుస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి కేటాయింపులు చేయకపోవడం విడ్డూరం.
విరాళాల ద్వారా సేకరిస్తామని చెప్పే ప్రభుత్వ పెద్దలు , రాజకీయ నాయకులు ఎందుకు ఈ స్కీమ్ కు విరాళాలు ఇవ్వరో వారికే తెలియాలి.
రోజు రోజుకీ ఖర్చులు పెరుగుతున్న ఈ తరుణంలో విద్యకు మన తెలంగాణా ప్రభుత్వం కేటాయింపు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది చూడండి.
అందుకే సామాజిక బాధతగా ప్రజా ప్రతినిధులందరూ తమ పదవీ కాలంలో ప్రతీ సంవత్సరం ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ను దత్తత తీసుకుని , అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే వారి వారి నియోజక వర్గాల్లో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి. ఒక్కసారి ఆలోచించండి మన శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు , పార్లమెంటు సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్‌ లు ప్రతీ సంవత్సరం ఒక స్కూల్ ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసినా ఎన్ని స్కూల్స్ బాగుపడతాయి. ఆలోచన చేయండి.

ధన్యవాదములతో..
మోకెనపల్లి శ్రీనివాస్
గవర్నమెంట్ టీచర్
7386939369




Comments

Popular posts from this blog

భారతదేశం అక్షరాస్యత శాతం - రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారిగా

The Three Laughing Monks- A Beautiful Life Lesson