మీకు తెలుసా ! సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ యంత్రాంగమూ ఈ 17 అంశాల సమాచారాన్ని స్వచ్ఛందంగా ప్రజలకు అందుబాటులోకి ఉంచాలి.
స్వచ్ఛంద సమాచారం (సెక్షన్ 4(1)(బి))
సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ యంత్రాంగమూ ఈ 17 అంశాల సమాచారాన్ని స్వచ్చందంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
1. సంస్థకు సంబంధించిన వివరాలు, విధులు, మినిట్స్ ప్రజలకు వెల్లడించేవేనా? కాదా?
2. శాఖలు/ సంస్థల అధికారులు, ఉద్యోగుల అధికారాలు, విధులు
3. నిర్ణయాలు తీసుకోవడానికి అనుసరించే పద్ధతులు, పర్యవేక్షణ, జవాబుదారీతనానికి ఉన్న మార్గాలు
4. తమ బాధ్యతల నిర్వహణకు రూపొందిం చిన నియమావళి
5. ఉద్యోగుల బాధ్యతల నిర్వహణకు వినియోగిస్తున్న నియమావళి, రెగ్యులేషన్లు, ఆదేశాలు, మాన్యువళ్లు, రికార్డులు
6. తమ వద్ద ఉన్న / తన ఆధీనంలో ఉన్న వివిధ డాక్యుమెంట్ల పట్టిక
7. డాక్యుమెంట్ల విధాన రూపకల్పన/ అమలు చేసే ప్రక్రియలో ప్రజాప్రతినిధులతో సంప్ర దింపులకు/ ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించ డానికి ఏదైనా ఏర్పాటు ఉంటే... దాని వివరాలు
8. ప్రతి ప్రభుత్వ యంత్రాంగ బోర్డులు, కౌన్సిళ్లు, కమిటీలు, సంస్థలో ఏర్పాటు చేసు కున్న సలహా సంఘ సభ్యుల పట్టిక: ఇతర విభాగాల సమావేశాలు, బహిరంగమైన వేనా? కాదా? ఆయా సమావేశాల నెలా పొందే జీతభత్యాలు, రాయితీలు
9. అధికారులు, ఉద్యోగుల వివరాలను తెలిపే డైరెక్టరీ
10. అధికారులు, ఉద్యోగులు వ్యక్తిగతంగా ప్రతి బాధ్యతలు
11. తమ ఏజెన్సీలకు కేటాయించిన బడ్జెట్లు, ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు, పంపిణీ చేసిన నిధుల నివేదికలు
12. రాయితీ కార్యక్రమాలను అమలు చేసే పద్ధతి, కేటాయించిన సొమ్ము, లబ్ధిదారుల సమాచారం
13. రాయితీలు, పర్మిట్లు, ఆథరైజేషన్లు - పొందిన వారి వివరాలు
14. అందుబాటులో/ ఆధీనంలో ఉన్న సమాచారం, ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తమైన సమాచారం
15. సమాచారం పొందడానికి పౌరులకు కల్పిం చిన సదుపాయాలు, గ్రంథాలయాలు/ రీడిండ్రూములు ఉంటే... వాటి పనివేళలు
16. సహాయ / ప్రజా సమాచార అధికారుల పేర్లు, హోదాలు
17. ప్రతి ఏడాది పై అంశాలపై సవరించిన, తాజా సమాచారాన్ని ప్రకటించాలి.
-Srinivas Mokenapalli
Comments
Post a Comment