నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా .స్మార్ట్ఫోన్లోనే సమస్త సమాచారం తెలుసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం.. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్డీఎల్ఐ) యాప్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అత్యంత ప్రామాణిక కంటెంట్ ఉంటుంది. టెక్నాలజీ, సైన్స్, హ్యుమానిటీస్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల్లో నిష్ణాతులైన కంటెంట్ హోస్టులు, 100కి పైగా లెర్నింగ్ టూల్స్ , దాదాపు 70 లక్షల పుస్తకాలు.. గత ప్రశ్నాపత్రాలు, వ్యవసాయం, చరిత్ర, టెక్నాలజీ, కంప్యూటర్, సైన్స్ ,సోషియలాజీ, ఆంత్రోపాలజీ, విద్య పరిశోధన, భౌతికశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర పుస్తకాలు ఈ యాప్ ఆండ్రాయిడ్/ఐఓయస్ ఆధారంగా చదువుకోవచ్చు.దీనికి కావల్సిందల్లా ఇంటర్నెట్. ఒకసారి రిజిస్టర్ చేసుకుని లాగిన్ ఐతే సరిపోతుంది.జాతీయ విద్యా మిషన్లో భాగంగా జాతీయ డిజిటల్ లైబ్రరీని రూపొందించింది. అన్నిరకాల పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఇందులో అందుబాటులో ఉంచింది. వీడియో పాఠాలను సైతం ఉచితంగా అందిస్తోంది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్ కూడా ఇందులో ఉంచింది. NDLI అంటే ఏమిటి? నేష...
Comments
Post a Comment