బ్లాక్ రైస్ తో చాలా ప్రయోజనాలు
Black Rice Benefits : నల్ల బియ్యం అనే ఇంకో రకమైన బియ్యం కూడా ఉన్నాయని మీకు తెలుసా ..!నల్ల బియ్యంను పూర్వ కాలంలో ఈశాన్య భారత దేశంలో ఎక్కువగా సాగుచేసేవారు. అసలు బియ్యంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస,నల్ల బియ్యం ఇలా అనేక రకాలుగా ఉంటాయి .మనకు ఎక్కువగా తెల్ల బియ్యం మరియు బ్రౌన్ రైస్ ఈ రకమైన బియ్యం తెలుసు .అయితే ఈ రకమైన బియ్యం ఆసియా ఖండంలో ప్రజలకు ప్రధాన ఆహరం .ఈ నల్ల బియ్యం మన దేశం నుంచి చైనాలోకి అడుగు పెట్టి అక్కడ ప్రసిద్ధిగాంచింది.నల్ల బియ్యంను ముఖ్యంగా పూర్వ కాలంలో రాజులు మాత్రమే విటిని తినడానికి పండిచేవారని చరిత్రకారుల కథనం .ఈ నల్ల బియ్యంను చాలా తక్కువగా సాగు చేయడం వలన కొంతమందికి మాత్రమే ఈ బియ్యం గురించి తెలుసు . నల్ల బియ్యం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం .మణిపూర్ లో ప్రధాన ఆహరం నల్ల బియ్యం ..అయితే ఒడిశా ,పచ్చిమ బెంగాల్ ,ఝార్ఖండ్లతో పాటు ఏపీ, తెలంగాణలో కూడా నల్ల బియ్యంను సాగుచేస్తున్నారు .
ఈ బియ్యం తినడం వలన డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతుంది అని వైద్యులు చెబుతున్నారు .ఎందుకనగా బ్రౌన్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉండటం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది .అది మనకు తెలుసు . బ్రౌన్ రైస్ మాదిరిగానే ఈ నల్ల బియ్యంలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా మదుమేహంను నివారించగలదు .
Comments
Post a Comment