Law Of Attraction గూర్చి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
The Secret Book రచయిత రోండా బర్న్ ఆకర్షణ సిద్ధాంతం గూర్చి చక్కగా వివరించారు. సిద్ధాంతాన్ని మన జీవితానికి ఎలా ఆపాదించుకుని లబ్ధిపొందాలనే రహస్యం చెప్పారు.
ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగి ఉన్నది. చేజారినది. అపహరించబడినది. లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చెయ్యబడినది. తరువాతి తరాలవారికి రూ. అందించబడుతూ వస్తున్నది. శతాబ్దాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలామంది అర్ధం చేసుకున్నారు : ప్లేటో, గెలీలియో, బిథోవెన్, ఎడిసన్, కార్నెగీ, ఐన్స్టీన్, వంటివారు. వీరితోపాటు మరికొందరు ఆవిష్కర్తలూ, వేదాంతులూ, శాస్త్రవేత్తలూ, గొప్ప తాత్వికులూ కూడా దీన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రహస్యం లోకానికి వెల్లడి చెయ్యబడుతోంది.
"ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో, మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరచుకోగలరో, మీ మనసుకు నచ్చే పని ఎలా చెయ్యగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలియవస్తుంది. జీవితంలో మీ కోసం వేచిఉన్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు."
Comments
Post a Comment